1379 | GEN 45:20 | ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు. |
1512 | GEN 50:5 | ‘మా నాన్న నాతో ప్రమాణం చేయించి “ఇదిగో, నేను చనిపోతున్నాను, కనానులో నా కోసం తవ్వించిన సమాధిలో నన్ను పాతిపెట్టాలి అని చెప్పాడు కాబట్టి అనుమతిస్తే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తాను అని యోసేపు అన్నాడు” అని చెప్పండి’” అన్నాడు. |
4170 | NUM 15:16 | మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి’” అన్నాడు. |
7565 | 1SA 15:3 | కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, ఎద్దులైనా, గొర్రెలైనా, ఒంటెలైనా, గాడిదలైనా వేటినీ విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి, అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి’” అని చెప్పాడు. |
9420 | 1KI 20:9 | కాబట్టి అహాబు అ వార్తాహరులతో “మీరు రాజైన నా యజమానితో ఇలాచెప్పండి. ‘నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని, ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చేయలేను’” అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్లి ఆ జవాబు తెలియచేశారు. |
18535 | ISA 41:14 | పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు. |
19703 | JER 28:16 | కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’” అని చెప్పాడు. |
25646 | LUK 14:24 | నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’” అన్నాడు. |
25720 | LUK 16:31 | అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు. |