450 | GEN 18:25 | నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” |
467 | GEN 19:9 | కానీ వాళ్ళు “నువ్వు అవతలికి పో” అన్నారు. ఇంకా వాళ్ళు “వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు. |
526 | GEN 21:12 | అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు. |
539 | GEN 21:25 | అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు. |
613 | GEN 24:21 | ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు |
722 | GEN 26:29 | మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.” |
809 | GEN 29:13 | లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. |
863 | GEN 30:32 | ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి. |
965 | GEN 33:4 | అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. |
966 | GEN 33:5 | ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి “వీరు నీకేమౌతారు?” అని అడిగాడు. అతడు “వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే” అని చెప్పాడు. |
1104 | GEN 37:20 | వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు. |
1342 | GEN 44:17 | యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు. |
1373 | GEN 45:14 | తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు. |
1416 | GEN 46:29 | యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. |
1462 | GEN 48:10 | ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. |
1479 | GEN 49:5 | షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. |
1491 | GEN 49:17 | దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. |
1516 | GEN 50:9 | రథాలు, రౌతులు అతనితో వెళ్ళాయి. అది చాలా పెద్ద గుంపు అయింది. |
1899 | EXO 14:9 | బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. |
1907 | EXO 14:17 | చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. |
1908 | EXO 14:18 | నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” |
1913 | EXO 14:23 | ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. |
1916 | EXO 14:26 | యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. |
1918 | EXO 14:28 | నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. |
1922 | EXO 15:1 | అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు. |
1940 | EXO 15:19 | ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు. |
1971 | EXO 16:23 | అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.” |
2064 | EXO 20:12 | నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి. |
2134 | EXO 22:19 | యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి, వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు. |
2296 | EXO 28:2 | అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి. |
2988 | LEV 10:10 | మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి. |
3121 | LEV 14:9 | ఏడో రోజున అతడు తన తలపై జుట్టునంతా క్షౌరం చేసుకోవాలి. తరువాత తన గడ్డాన్నీ, కనుబొమలను కూడా క్షౌరం చేసుకోవాలి. తన జుట్టు అంతా క్షౌరం చేసుకున్న తరువాత తన బట్టలు ఉతుక్కుని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. |
3259 | LEV 18:7 | నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. |
3260 | LEV 18:8 | నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు. |
3262 | LEV 18:10 | నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే. |
3266 | LEV 18:14 | నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి. |
3268 | LEV 18:16 | నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం. |
3285 | LEV 19:3 | మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. |
3312 | LEV 19:30 | నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను. |
3313 | LEV 19:31 | చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను. |
3314 | LEV 19:32 | తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. |
3330 | LEV 20:11 | తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు. |
3377 | LEV 22:7 | సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా. |
3506 | LEV 25:36 | అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. |
3516 | LEV 25:46 | అలాటి బానిసలను మీ తరవాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలౌతారు. కానీ మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు. |
3980 | NUM 9:14 | మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.” |
3999 | NUM 10:10 | మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.” |
4112 | NUM 14:3 | ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు. |
4140 | NUM 14:31 | కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు. |
4255 | NUM 17:25 | అప్పుడు యెహోవా మోషేతో “అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది” అన్నాడు. |
4302 | NUM 19:12 | అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు. |
4303 | NUM 19:13 | మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది. |
4309 | NUM 19:19 | మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు. |
4454 | NUM 24:7 | అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది. |
4469 | NUM 24:22 | కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది” అన్నాడు. |
4471 | NUM 24:24 | కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి. అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి. కిత్తీయులు కూడా నాశనమౌతారు” అన్నాడు. |
4664 | NUM 30:15 | అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు. |
4735 | NUM 32:15 | మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.” |
4933 | DEU 1:39 | అయితే మంచీ చెడూ తెలియని మీ కొడుకులు, అంటే అన్యాయానికి గురౌతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగు పెడతారు. దాన్ని వారికిస్తాను. వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. |
5035 | DEU 4:29 | అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు. |
5071 | DEU 5:16 | మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి. |
5159 | DEU 8:20 | యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.” |
5315 | DEU 14:23 | మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి. |
5416 | DEU 19:8 | యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి. |
5461 | DEU 21:12 | నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి. |
5470 | DEU 21:21 | అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు. |
5473 | DEU 22:1 | మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి. |
5596 | DEU 27:9 | మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి. |
5926 | JOS 4:14 | ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేసినందువల్ల వారు మోషేను గౌరవించినట్టు యెహోషువా జీవించినంత కాలం అతన్ని గౌరవించారు. |
6062 | JOS 9:23 | ఆ కారణం వల్ల మీరు శాపగ్రస్తులౌతారు, నా దేవుని ఆలయానికి కట్టెలు నరకడానికీ నీళ్లు తోడడానికీ మీలో కొంతమంది ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు” అన్నాడు. |
6484 | JOS 24:6 | నేను ఐగుప్తులోనుండి మీ పూర్వీకులను రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు రథాలతో రౌతులతో వారిని ఎర్రసముద్రం వరకూ తరిమారు. |
6668 | JDG 6:12 | యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, |
6840 | JDG 11:9 | అందుకు యెఫ్తా “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకు వెళ్లిన తరువాత యెహోవా వాళ్ళను నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధానినౌతానా?” అని గిలాదు ఆ పెద్దలను అడగగా, |
6891 | JDG 13:5 | నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.” |
6962 | JDG 16:11 | సంసోను “కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను” అన్నాడు. |
6968 | JDG 16:17 | అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు. |
6970 | JDG 16:19 | ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది. |
6973 | JDG 16:22 | అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి. |
7000 | JDG 18:5 | అప్పుడు వాళ్ళు “మేము చేయబోయే పని సఫలమౌతుందో లేదో దేవుణ్ణి అడిగి మాకు చెప్పు” అన్నారు. |
7062 | JDG 20:6 | వాళ్ళు నా ఉంపుడుగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం, దౌర్జన్యం వాళ్ళు జరిగించారు కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికి ఆ ముక్కలను పంపాను.” |
7208 | RUT 4:16 | అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది. |
7275 | 1SA 2:33 | నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు. |
7312 | 1SA 4:13 | అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు. |
7395 | 1SA 9:2 | కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు. |
7396 | 1SA 9:3 | సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు. |
7398 | 1SA 9:5 | అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు “మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు” అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు, |
7400 | 1SA 9:7 | అప్పుడు సౌలు “మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?” అని తన పనివాణ్ణి అడిగాడు. |
7401 | 1SA 9:8 | వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు. |
7403 | 1SA 9:10 | అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు. |
7408 | 1SA 9:15 | సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు. |
7410 | 1SA 9:17 | సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు. |
7411 | 1SA 9:18 | సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు, |
7412 | 1SA 9:19 | సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను. |
7414 | 1SA 9:21 | అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు. |
7415 | 1SA 9:22 | అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి |
7417 | 1SA 9:24 | అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. “చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు. |