Wildebeest analysis examples for:   tel-tel2017   Word?    February 11, 2023 at 19:42    Script wb_pprint_html.py   by Ulf Hermjakob

67  GEN 3:11  దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.
86  GEN 4:6  యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు?
90  GEN 4:10  దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది.
317  GEN 12:18  అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి “నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
318  GEN 12:19  ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు” అని చెప్పాడు.
363  GEN 15:2  అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా!
390  GEN 16:8  ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది.
415  GEN 17:17  అప్పుడు అబ్రాహాము తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకుని “ఒక మనిషికి నూరేళ్ళ వయస్సులో పిల్లలు పుడతారా? తొంభై ఏళ్ల శారా పిల్ల వాణ్ని కంటుందా?” అని మనస్సులో అనుకున్నాడు.
437  GEN 18:12  శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
438  GEN 18:13  అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది?
439  GEN 18:14  యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
443  GEN 18:18  అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
448  GEN 18:23  అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
449  GEN 18:24  ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
463  GEN 19:5  వాళ్ళు లోతును పిలిచారు. “ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరీ? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా” అన్నారు.
470  GEN 19:12  అప్పుడు ఆ దూతలు లోతుతో “ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా.
500  GEN 20:4  అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు “ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా?
505  GEN 20:9  అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు “నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు” అన్నాడు.
521  GEN 21:7  ఆమె ఇంకా “శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా” అన్నది.
531  GEN 21:17  దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.
587  GEN 23:15  “అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో” అన్నాడు.
615  GEN 24:23  ఆమెను “నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు.
623  GEN 24:31  అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు. “యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను” అన్నాడు.
642  GEN 24:50  అప్పుడు లాబానూ, బెతూయేలూ ఇలా జవాబిచ్చారు. “ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో, చెడో మేమేమి చెప్పగలం?
703  GEN 26:10  అందుకు అబీమెలెకు “నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!” అన్నాడు.
746  GEN 27:18  అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు “కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?” అని అడిగాడు.
761  GEN 27:33  దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. “అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.”
765  GEN 27:37  అందుకు ఇస్సాకు “చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?” అన్నాడు.
766  GEN 27:38  ఏశావు తన తండ్రితో “నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు” అంటూ గట్టిగా ఏడ్చాడు.
811  GEN 29:15  లాబాను “నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు” అని యాకోబును అడిగాడు.
821  GEN 29:25  తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకుని లాబానుతో “నువ్వు నాకు చేసిందేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది? ఎందుకు నన్ను మోసపుచ్చావు?” అన్నాడు.
846  GEN 30:15  అందుకామె “నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా” అంది. అందుకు రాహేలు “అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు” అని చెప్పింది.
888  GEN 31:14  అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?
890  GEN 31:16  దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి” అని అతనికి జవాబు చెప్పారు.
900  GEN 31:26  అప్పుడు లాబాను యాకోబుతో “ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు?
901  GEN 31:27  నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే.
910  GEN 31:36  యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ “నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి?
911  GEN 31:37  నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు.
917  GEN 31:43  అందుకు లాబాను “ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను?
946  GEN 32:18  వారిలో మొదటివాడితో “నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, ‘నీవెవరి వాడివి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ముందు ఉన్నవి ఎవరివి?’ అని నిన్ను అడిగితే
1092  GEN 37:8  అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.
1094  GEN 37:10  అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో “నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?” అని అతణ్ణి గద్దించాడు.
1110  GEN 37:26  అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?
1111  GEN 37:27  ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు.
1298  GEN 43:7  వారు “అతడు ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. ‘మీ తమ్ముణ్ణి తీసుకు రండి’ అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?” అన్నారు.
1318  GEN 43:27  అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు,
1329  GEN 44:4  వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?
1330  GEN 44:5  నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు.
1332  GEN 44:7  వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.
1333  GEN 44:8  చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?
1340  GEN 44:15  అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు.
1341  GEN 44:16  యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు.
1359  GEN 44:34  ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.
1436  GEN 47:15  ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
1440  GEN 47:19  మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు.
1483  GEN 49:9  యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
1526  GEN 50:19  యోసేపు “భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా?
1551  EXO 1:18  ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.
1569  EXO 2:14  అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు.
1575  EXO 2:20  అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
1613  EXO 4:11  అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా.
1616  EXO 4:14  అందుకు యెహోవా మోషే మీద కోపపడి “లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు.
1635  EXO 5:2  అందుకు ఫరో “యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను” అన్నాడు.
1637  EXO 5:4  ఐగుప్తు రాజు “మోషే, అహరోనూ, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డు పడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి.
1648  EXO 5:15  ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. “తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?
1655  EXO 5:22  మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి “ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు?
1668  EXO 6:12  అప్పుడు మోషే “ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు” అని యెహోవా సముఖంలో చెప్పాడు.
1781  EXO 10:3  మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
1785  EXO 10:7  అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు.
1788  EXO 10:10  అందుకు ఫరో “యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.
1895  EXO 14:5  ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. “మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?” అని చెప్పుకున్నారు.
1901  EXO 14:11  అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా?
1905  EXO 14:15  యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు.
1932  EXO 15:11  పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?
1954  EXO 16:6  మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. “మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
1976  EXO 16:28  అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు “మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?
1986  EXO 17:2  దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు.
1988  EXO 17:4  అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు.
2014  EXO 18:14  ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో “నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడివే తీర్పరిగా కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి?” అని అడిగాడు.
2141  EXO 22:26  వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.
2450  EXO 32:11  అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.
2451  EXO 32:12  ఐగుప్తీయులు ‘వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు.
2490  EXO 33:16  నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు.
2995  LEV 10:17  “మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.
3490  LEV 25:20  ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము? మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు గదా అనుకుంటారేమో.
4029  NUM 11:4  కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?
4036  NUM 11:11  అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
4037  NUM 11:12  ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
4038  NUM 11:13  ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు.
4043  NUM 11:18  నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
4047  NUM 11:22  ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
4048  NUM 11:23  అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
4054  NUM 11:29  దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
4062  NUM 12:2  “యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?” అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు.
4095  NUM 13:19  వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?
4096  NUM 13:20  అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.
4112  NUM 14:3  ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు.
4120  NUM 14:11  యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?
4136  NUM 14:27  “నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.
4150  NUM 14:41  కాని మోషే “మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు?